
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఆయన సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తో కలిసి ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపైదృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవ్, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, డీసీఓ పద్మ, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్