
వయోజనులకు అక్షరాలు నేర్పేలా..
నాగారం : నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలోని వయోజన విద్య మొక్కుబడిగా సాగడంతో ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. ఈ సారి కేంద్రం ప్రభుత్వం నవభారత్ సాక్షారత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని తెచ్చింది. 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించింది. తొలి విడతలో మహిళలకు ప్రాధాన్యమిచ్చింది. నిరక్షరాస్యులను గుర్తించి ‘ఉల్లాస్’ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
150 మార్కులతో తుది పరీక్ష..
స్వశక్తి సంఘాల మహిళలు, ఉపాధి కూలీలు, ఐసీడీఎస్ లబ్ధిదారుల్లో నిరక్షరాస్యుల గుర్తించి రాయడం, చదవడం, చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పిస్తారు. వంద రోజుల్లో నేర్పించి 150 మార్కులతో తుది పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువపత్రాలు పంపిణీ చేస్తారు. ఆర్థిక అవగాహన, సాంకేతిక అక్షరాస్యత, న్యాయపరిజ్ఞానంపై శిక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 65.23 శాతం అక్షరాస్యత ఉంది.
టీచర్లు, వీఓఏలకు ముగిసిన శిక్షణ
మహిళల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సంఘాల్లో లావాదేవీల సొమ్మును స్వాహా చేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,13,426 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో తొలి విడతలో భాగంగా 41,526 మందిని శ్రీఉల్లాస్‌శ్రీ యాప్‌లో నిక్షిప్తం చేశారు. అనంతరం జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన వారు ఇటీవల మండల స్థాయిలో ఉపాధ్యాయులకు, వీఓఏలకు శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామస్థాయిలో సంఘాల్లోని ఔత్సాహిక మహిళలను వలంటీర్లుగా నియమించి శిక్షణ ఇచ్చారు. పాఠశాలల పరిధిలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులకు అప్పగించారు. తమ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పిల్లలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
లోపాలపై దృష్టి సారిస్తేనే..
సాక్షర భారత్‌లో వలంటీర్లకు పంపిణీ చేసిన పుస్తకాలు లబ్ధిదారులకు చేరుకోలేదు. నామమాత్రంగా అర్హత పరీక్ష ఏర్పాటు చేసి అందరినీ ఉత్తీర్ణత సాధించేలా చేశారు. కొందరు అక్షరాలు నేర్చుకుని మరిచి పోయారు. ప్రధానోపాధ్యాయులు నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల అక్షర ప్రగతిపై పిల్లలతో సమీక్షించాల్సి ఉన్నా అది చేయలేదు. వలంటీర్లపై పర్యవేక్షణ పెంచితేనే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఫ ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
ఫ ఇప్పటికే నిరక్షరాస్యులను
గుర్తించిన అధికారులు
ఫ ప్రత్యేక యాప్‌లో పేర్లు నమోదు
ఫ ఉపాధ్యాయులు, వీఓఏలు,
వలంటీర్లకు శిక్షణ పూర్తి
ఫ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే బోధన ప్రారంభించే అవకాశం
జిల్లాలో
నిరక్షరాస్యులు
1,13,426
తొలి విడతకు
ఎంపికై న వారు
41, 526