
ఐదు దశాబ్దాల అనుబంధం
కోదాడ: వారంతా ఐదు దశాబ్దాల క్రితం (1976–77 సంవత్సరంలో) మఠంపల్లి మండల కేంద్రంలోని వివేకవర్ధిని పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు. ప్రస్తుతం వారి వయస్సు 65 సంవత్సరాలపై మాటే. వారంతా ఆదివారం కోదాడలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో జరిగిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులతోపాటు పాఠశాల తీపిగుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. 50 ఏళ్ల తరువాత ఒక వేదిక మీద కలుసుకోవడం చెప్పలేని ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముత్తినేని సైదేశ్వరరావు, తాటికొండ కృష్ణారెడ్డి, కోటిరెడ్డి, తీగల చంద్రశేఖర్‌రెడ్డి, తిప్పన వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రావు, పుష్ప, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.