
పోరాట యోధుడు.. కొండా లక్ష్మణ్ బాపూజీ
భానుపురి (సూర్యాపేట) : తన తుదిశ్వాస వరకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్‌రావు అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని పద్మశాలి భవన్‌లో ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారన్నారు. 96 ఏళ్ల వయస్సులోనూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సాధనకు నిరాహార దీక్షలు చేసిన గొప్ప నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చలమల్ల నరసింహ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కడారి భిక్షం, పోపా జిల్లా అధ్యక్షుడు మిర్యాల గోపాలకష్ణ, యలగందుల సుదర్శన్, పొన్నం వెంకన్న, అయిటిపాముల శ్రీనివాస్, కనుకుంట్ల శారదాదేవి, మిట్టకోల యుగంధర్, చిలుకూరు గోవర్ధన్, యల్లే సత్యనారాయణ, మిరియాల సుధాకర్, బాల్నే క్రాంతి, పున్నా వెంకన్న, గూడూరు నాగేశ్వరరావు, పసునూరి పాండయ్య, వనం శ్రీనివాస్ పాల్గొన్నారు.