
లిఫ్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
పాలకవీడు: మండలంలో జాన్‌పహాడ్ వద్ద కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న జవహర్ జాన్‌పహాడ్ లిఫ్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కృష్ణా, మూసీనదుల పరీవాహక ప్రాంత రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి కృష్ణానదిపై జాన్‌పహాడ్ వద్ద, మూసీనదిపై బెట్టెతండా వద్ద లిఫ్ట్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ అధికా రులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్‌వీ.సుబ్బారావు, మాజీఎంపీపీ భూక్యా గోపాల్, నాయకులు మాళోతు మోతీలాల్, జితేందర్‌రెడ్డి, కొణతం చిన వెంకట్‌రెడ్డి, తీగల శేషురెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.