
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
సూర్యాపేటటౌన్ : విధుల నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యం వహించొద్దని, సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసుల పరిష్కారం, రాత్రి గస్తీ విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు.. ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు, డయల్ 100 కాల్స్ పై వేగంగా స్పందించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, వెంకటయ్యలకు మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్, ఎస్‌ఐలు రవీందర్, సురేష్ రెడ్డి, రవీందర్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లుకు రివార్డ్‌లు అందించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్‌రెడ్డి, డీసీ ఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
30వ తేదీ వరకు ‘30పోలీస్ యాక్ట్’
జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఈనెల 30వ తేదీ ‘30 పోలీస్ యాక్ట్’ అమల్లో ఉంటుందని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించవద్దని సూచించారు.