
సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం
సూర్యాపేట అర్బన్: సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమనూరు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో డిస్కం జిల్లా అధ్యక్షుడు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలని, ఆర్టీజన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిస్కం కార్యదర్శి జి.సాయిబాబా, రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కె.రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్, సలహాదారు ఆర్.జనార్దన్ రెడ్డి, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.వెంకన్న, డిస్కం కార్యదర్శి ఎం.భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాసరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు దాదాపు 400 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.