
పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి..
పాఠశాలల వివరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పరిపూర్ణంగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక హౌస్‌లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేస్తాం. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
నాగారం : ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ భవిష్యత్‌లో వారుపరిపూర్ణంగా ఎదిగేలా తీర్చిదిద్దాలని విద్యా శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రత్యేకంగా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తరగతి గదులు, పాఠాలకే పరిమితమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా శాఖ ఇతర అంశాలపై అవగాహన కల్పించనుంది. విద్యార్థుల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని నెలకొల్పేలా కార్యక్రమాలను చేపట్టనుంది. అందుకు ఈనెల 15వ తేదీ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలల్లో తరగతుల వారీగా నాలుగు హౌస్‌లను ఏర్పాటుచేస్తారు. వాటికి అబ్దుల్ కలాం–రెడ్ హౌస్, శకుంతలాదేవి–గ్రీన్ హౌస్, సీవీ రామన్–బ్లూ హౌస్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్–ఎల్లో హౌస్‌గా నామకరణం చేశారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఏదో ఒక హౌస్‌లో సభ్యులుగా చేరాల్సి ఉంటుంది.
సామాజిక స్పృహ పెంచాలని..
ప్రధానంగా తరగతి గదుల్లో పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్‌లో ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశాలపై శ్రద్ధ చూపడం లేదు. ఇంటికి, బడికి మాత్రమే పరిమితమవుతూ ఎక్కువగా పాఠ్యాంశాల్లోనే లీనమవుతున్నారు. సమయం దొరికినప్పుడు డిజిటల్ ఉపకరణాలకు అతుక్కుపోతున్నారు. దీంతో పిల్లలకు సామాజిక స్పృహ కరవవుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకున్న విద్యా శాఖ ప్రభుత్వ స్కూళ్లలో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు సిద్ధమైంది.
కార్యక్రమాలు ఇలా..
ఫ హౌస్ కమిటీల ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారు.
ఫ తోటి విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలగడం, సహనంతో వ్యవహరించడం గురించి వివరిస్తారు.
ఫ శాసీ్త్రయ దృక్పథంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థుల మేధో వికాసానికి క్విజ్, పజిల్స్ వంటి గేమ్స్‌ను నిర్వహిస్తారు. – సాహిత్యంపై సదస్సులు ఏర్పాటు చేస్తారు. కథలు చెబుతారు. విద్యార్థులతో చెప్పిస్తారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు.
ఫ మధ్యాహ్న భోజనం పరిశీలన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములను చేస్తారు.
ఫహౌస్ కమిటీల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు విద్యా శాఖ రూ.6,250 చొప్పున నిధులు కేటాయించింది.
ప్రాథమికోన్నత 78
జెడ్పీ ఉన్నత 182
కేజీబీవీలు 18
ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్లు
ఫ 15 నుంచి ఏర్పాటు చేస్తున్న
విద్యా శాఖ అధికారులు
ఫ నాయకత్వ లక్షణాలూ
పెంపొందించేలా కార్యాచరణ
ఫ ప్రతి తరగతి నుంచి
విద్యార్థుల భాగస్వామ్యం

పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి..