
తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
చిలుకూరు: చిలుకూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్‌కు షో కాజ్ నోటీసులు జారీచేశామ ని తహసీల్దార్ ధృవకుమార్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సాక్షిలో శుక్రవారం చేతులు తడిపితేనే ఆన్‌లైన్‌లో ఎంట్రీ అనే కథననం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ స్పందించి బాధ్యులైన కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికారులకు తెలియజేసి సరెండర్ చేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ క్రమంలో కంప్యూటర్ సీటును తహసీల్దార్ రూమ్ పక్కకు మార్చారు.
ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : దసరా సెలవులకు ఊర్లకు, దూరప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ రోజులు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో, చుట్టుపక్కల ఉన్న ఇరుగుపొరుగు వారికి తెలపాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల సిస్టం ఏర్పాటు చేసుకోవాలని కోరా రు. విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో గాని, వెంట గాని తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 86057, 8712686026 నంబర్లకు ఫోన్ చేసి సేవలు పొందాలని కోరారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
చివ్వెంల : విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం ఆమె సూర్యాపేట పట్టణంలోని బాలసదన్, విజయ్‌నగర్ కాలనీలో చిల్డ్రన్ హోంను తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సీడీబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, కె.రాంరెడ్డి, భిక్షం, పి.నాగరాజు, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి పీవైఎల్
శిక్షణ తరగతులు
సూర్యాపేట అర్బన్ : కోదాడలో ఈనెల 25, 26న జరిగే ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేటలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో బండి రవి, పెద్దింటి అశోక్, ప్రవీణ్, కూరాకుల నాగన్న, రమేష్ పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరికి షోకాజ్ నోటీసులు