
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలి
కోదాడ: జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నామ నరసింహారావు అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడలోని శ్రీవైష్ణవి పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలికల సబ్ జూనియర్ జిల్లా కబడ్డీ జట్టు కోచింగ్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడలో నైపుణ్యం ఉన్న 25 మంది బాలికలను ఈ క్యాంపుకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 24 వరకు శిక్షణ ఇచ్చి ప్రతిభ చూపిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేసి సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజమాబాద్‌లో జరిగే అంతర్‌రాష్ట్ర పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, శెట్టి రామచందర్‌రావు, వైష్ణవి పాఠశాల చైర్మన్ లక్ష్మణరావు, సైదులు, బసవయ్య, రమేష్‌బాబు, ఉదయ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
నూతనకల్ : రవాణా రంగ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం నూతనకల్ మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఆల్ రోడ్ ట్రాన్స్‌ఫోర్టు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సభలో రైతు సంఘం ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి, ఎనిగతల సోమయ్యగౌడ్, బత్తుల సుధాకర్, బి. స్వరాజ్యం, ఎన్. రాంమ్మూర్తి, బొజ్జ శ్రీను, ఉప్పు లక్ష్మణ్, పంతం వెంకన్న, బొజ్జ విజయ్ పాల్గొన్నారు.