
మట్టపల్లిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, పంచగవ్య ఆరాధన, ప్రాశన, రుత్విగ్వరణం, ధీక్షాధారణ, రక్షాబంధనం, మేథినీపూజ, మత్స్యంగ్రహణం, అంకురారోపణ తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 22 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం అగ్నిమథనం, వాస్తుపూజ, వాస్తుహోమం, పవిత్రములకుశుద్ధి తదితర కార్యక్రమాలుంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.