
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితాలు–2002, 2025లను సరిపోల్చే ప్రక్రియలో అధికారులు సమన్వయంలో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి హాజరై కలెక్టర్ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఎలక్షన్ విభాగం డీటీ వేణు తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూభారతి చట్టం ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లో పైలెట్ పద్ధతిన దీర్ఘకాల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా షెడ్యూల్ జారీ చేస్తామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసే సమయంలో రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్