జిల్లా అండర్‌–18 సెపక్‌తక్ర జట్ల ఎంపికలు రేపు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అండర్‌–18 సెపక్‌తక్ర జట్ల ఎంపికలు రేపు

Oct 6 2025 9:21 AM | Updated on Oct 6 2025 9:21 AM

జిల్ల

జిల్లా అండర్‌–18 సెపక్‌తక్ర జట్ల ఎంపికలు రేపు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్‌–18 బాలబాలికల సెపక్‌తక్ర జట్ల ఎంపికలు ఈనెల 7వ తేదీన జరగనున్నాయని శ్రీకాకుళం జిల్లా సెపక్‌తక్ర అసోసియేషన్‌ చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఎంపికలు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీకాకు ళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో సెలక్షన్‌ ట్రయల్స్‌ జరుగుతాయని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలిక లు 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని పేర్కొ న్నారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను ఈనెల 11, 12 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాల వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సెపక్‌తక్ర చాంపియన్‌షిప్‌–2025 పోటీలకు పంపించనున్నట్టు ఎమ్మెస్సార్‌ వెల్లడించారు. ఎంపికలకు హాజర య్యే క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, నాలుగు పాస్‌ఫొటోలను తమ వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు కోచ్‌ జి.అర్జున్‌రావురెడ్డి (సెల్‌: 9949291288)ని సంప్రదించాలని సూచించారు.

వంశధార మెయిన్‌ కాలువ గట్టుకు గండి

నందిగాం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బెజ్జిపల్లి పంచాయతీ సింగుపురం సమీపంలో వంశధార ఎడమ ప్రధాన కాలువ 73వ కిలోమీటరు వద్ద భారీ గండి పడింది. దీంతో కాలువలోని నీరు కిందనున్న పంటపొలాలను ముంచేసింది. ఆదివారం వంశధార డీఈఈ శేఖర్‌రావు ఆధ్వర్యంలో గండిని పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అయితే మదనగోపాలసాగరం నుంచి నీరు అధికంగా వస్తుండటంతో కాలువలోని నీటిని డైవర్ట్‌ చేయడానికి వీలు కావడం లేదు. వంశధార కాలువలు 51, 52, 53, 54లను తెరిచి నీటిని విడిచిపెట్టినప్పటికీ ఉద్ధృతి ఆగలేదు. సోమవారం సాయంత్రానికి గండిని పూడ్చేలా చర్యలు తీసుకుంటామని డీఈఈ శేఖర రావు తెలిపారు.

‘కార్మిక సమస్యలు పరిష్కరించాలి’

సోంపేట: కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి పోరాడే సంస్థ సీఐటీయూ అని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. సోంపేటలో సీఐటీయూ జిల్లా మహాసభల ముగింపు వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద నుంచి గాంధీ మండపం వరకు ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. సభలో నర్సింగరావు మాట్లాడుతూ అంగన్‌వా డీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మందసలో జీడి పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు పని కల్పించకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకుంటే ధర్నా చేస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి ఆర్‌కేఎస్‌ఏ కుమా ర్‌, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు మాట్లాడుతూ పనిగంటలు పెంచుతూ ఆమోదించిన చట్టాన్ని రద్దు చేయాలన్నారు.

నూతన జిల్లా కమిటీ..

సభలో భాగంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సీహెచ్‌ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శిగా పి.తేజేశ్వరరావు, కోశాధికారిగా అల్లు సత్యనారాయణను ఎన్నుకున్నారు.

జిల్లా అండర్‌–18 సెపక్‌తక్ర జట్ల ఎంపికలు రేపు 1
1/1

జిల్లా అండర్‌–18 సెపక్‌తక్ర జట్ల ఎంపికలు రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement