
ఐదు గంటల శ్రమ
ఎవరూ ఆదుకోలేదు
మా గ్రామానిది దుర్భర పరిస్థితి. ఎప్పుడు వరద వచ్చినా బెండి గెడ్డ ఉప్పుటేరు వల్ల గ్రామం మునుగుతుంది. గ్రామం చుట్టూ రొయ్యిల చెరువులు నిర్మించడంతో వరద గ్రామంపై పడింది. దీంతో దీంతో 20 మంది యువకులం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాడుతో వరదలో చిక్కుకున్న జనాలను తరలించాం. వరద నీటిలో వృద్ధులు నడవలేక అవస్థలు పడ్డారు. ఒకరైతే కొట్టుకుపోయేవారే. చిన్నారులు, గర్భిణులు చాలా బాధపడ్డారు. – ఇప్పిలి తిరుపతి, యువకుడు, శివరాంపురం, వజ్రపుకొత్తూరు
వజ్రపుకొత్తూరు: చినుకులు సూదుల్లా గుచ్చుతున్నా, వాన దంచి కొడుతున్నా శివరాంపురం యువత చలించలేదు. విజయదశమి రోజు కురిసిన కుండపోత వర్షానికి ఊరికి బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో గ్రామానికి చెందిన ఇప్పిలి తిరుపతి, రమేష్, ఎరకారావు, లక్ష్మణరావు, దట్టి వాసుదేవరావుతో పాటు సుమారు 20 మంది వరకు యువకులు ఆ వరద నీటిలో ఐదు గంటల పాటు తాడు పట్టుకుని నిత్యావసరాలు తెచ్చుకునేలా, అవసరమైన వారు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. తమ గ్రామానికి పూండి గళ్లీ రహదారి నుంచి పక్కా రహదారి నిర్మించాలని ఎంతమందిని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.