
సొంత నిధులు వెచ్చించి..
జి.సిగడాం: తుఫాన్ వర్షాలకు శ్రీకాకుళం–రాజాం ప్రధాన రహదారిలో సంతవురిటి గ్రామ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడిపోవడంతో సుమారుగా 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, ధవళపేట సర్పంచ్ వడిశ మహేశ్వరరావు సొంత నిధులతో యంత్రాలను ఏర్పాటు చేసి చెట్టును తొలగించా రు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వై.మధుసూదనరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మహేశ్వరరావును ఎస్‌ఐతోపాటు సంతవురిటి సర్పంచ్ బుడారి లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాండ్రంగి వెంకటేష్ అభినందించారు.
ప్రయాణికుల కష్టాలు చూశాను..
వానలో ప్రయాణికుల కష్టాలు కళ్లారా చూశాను. చిన్నపిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని నా సొంత నిధులతో యంత్రాలను తెప్పించి చెట్టును తొలగించాం. నాకు ఇలాంటి సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
– వడిశ మహేశ్వరరావు, సర్పంచ్, దవళపేట, జి.సిగడాం

సొంత నిధులు వెచ్చించి..