
క్రీడాకారులకు ఉపకారం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభ కలిగిన నిరుపేద క్రీడాకారులకు బాసటగా నిలవాలని ఓఎన్‌జీసీ సంస్థ మరోసారి నిర్ణయించింది. ఓఎన్‌జీసీ క్రీడా స్కాలర్‌షిప్ పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్కా లర్‌షిప్‌లను అందజేయాలని నిర్ణయించించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తాజాగా విడుదల చేశారు. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ను 21 క్రీ డాంశాల్లో సట్–జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు, సీనియర్స్ పురుషులు, మహిళా క్రీడాకారులకు వర్తింపజేయనున్నారు. ఎంపికై నవారికి నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు క్రీడాస్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రావీణ్యత, అర్హత కలిగిన 250 మంది ప్లేయ ర్స్‌ను ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారన్నారు.
ఎవరు అర్హులంటే..
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేందుకు 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలబాలికలు అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. నిర్దేశించిన 21 క్రీడాంశాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెంది, ప్రతిభావంతులైన క్రీడాకారులు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఓఎన్జీసీ వెబ్‌సైట్ స్పోర్ట్స్‌స్కాలర్‌షిప్.ఓఎన్‌జీసీ.కో.ఇన్‌లో అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లు
అక్టోబర్ 21లోగా దరఖాస్తులకు అవకాశం
ఎంపికై తే నెలకు రూ.15వేలు నుంచి రూ.30వేల వరకు ఉపకార వేతనం
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ
గొప్ప అవకాశం
ప్రతిభ కలిగిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువ క్రీడాకారులకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. జిల్లాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఓఎన్‌జీసీ వెబ్‌పోర్టల్‌లో స్కాలర్‌షిప్ పథకం వివరాలతో పాటు నియమ నిబంధనలు, షరతులను గ్రహించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
– డాక్టర్ కె.శ్రీధర్‌రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి

క్రీడాకారులకు ఉపకారం