పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అయినప్పటికీ ప్రతి విషయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు. అధికారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకొంటూ.. నిత్యం అధికార కార్యక్రమాల్లో దర్జా చూపుతుంటారు. ఎమ్మెల్యే ఉన్నా.. లేకున్నా.. తానే ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో, కార్యక్రమాల్లో ‘పల్లె సింధూరరెడ్డి’ అన్న బోర్డు కనిపించిన సీట్లో కూర్చుంటుంటారు. ప్రొటోకాల్ కోసం నానా తిప్పలు పడుతూ.. ఉనికి చాటుకునేయత్నం చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యే తరహాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎవరయినా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేకు ఏం తెలీదని.. రాజకీయాల గురించి ట్రైనింగ్ ఇస్తున్నానని లెక్చర్ ఇస్తుంటారు. తాజాగా మూడురోజుల క్రితం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వేదికపై కలెక్టర్ పక్కనే ఆసీనులయ్యారు. అయినా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఆయన్ను ఆక్షేపించలేదు.


