చిలమత్తూరు: వాస్తవాలు తెలుసుకోకుండా నీచంగా మాట్లాడడం సరికాదని, ఈ విషమంగా మంత్రి అచ్చెన్నాయుడు తన తీరును మార్చుకోవాలంటూ హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక హితవు పలికారు. ఆంబోతులా వ్యవహరించడం మానుకోవాలన్నారు. తల పొగరుతో నీచంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అధికారం కోసం ఛండాలపు పనులు చేసే టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజామోదంతోనే నాడు మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎం అయ్యారని, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజల మనసులు గెలిచి సీఎం అయ్యారన్నారనే విషయం మరువరాదన్నారు. తన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొవడమే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడినని చెప్పుకునే చంద్రబాబులా దొడ్డి దారిన ముఖ్యమంత్రి కావాలని ఏనాడూ వైఎస్సార్ కుటుంబం ఆలోచన చేయలేదన్నారు. 2009లో మహానేత మరణం తర్వాత ఆయన తనయుడు సీఎం కావాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులేనని స్వయానా ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, తెలంగాణా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అయినా అచ్చెన్నాయుడు కేవలం చంద్రబాబు మెప్పు కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. దానిని యథాతథంగా ప్రసారం చేసి ప్రజలను పచ్చమీడియా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ కారిడార్ తెర మీదకు రావడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ, వైఎస్సార్ మరణంపై తల పొగరుతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ప్రజల దృష్టి మళ్లించే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. ఎందుకు ఇలాంటి బతుకు బతుకుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికై నా టీడీపీ నేతలు మారాలని, అభివృద్ది అంటే అమరావతి ఒక్కటే కాదనే విషయాన్ని గుర్తించి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని నోటికి వచ్చినట్లు తమ నాయకుడిని మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఆంబోతులా వ్యవహరించడం సరికాదు
ప్రజామోదంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్
‘పురం’ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక


