పుట్టపర్తి టౌన్: స్థానిక గణేష్ కూడలి సమీపంలో ఉన్న షాదీమహల్‌లో శుక్రవారం సర్వేయర్ల సంఘం అధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్ హాజరై, రక్తదానం చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన సర్వేయర్లకు, రక్తదాతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే భూరికార్డులు అధికారి విజయశాంతి బాయి, ఐఓఎస్‌లు, డీఐఔస్‌లు, మండల, వార్డు సర్వేయర్లు పాల్గొన్నారు.
జిల్లాలో ఆపిల్ సాగు
శుభపరిణామం
గార్లదిన్నె: జిల్లాలో ఆపిల్ పంట సాగు చేయడం శుభపరిణామమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గార్లదిన్నె మండలం కోటంకలో రైతు రమణారెడ్డి సాగు చేసిన ఆపిల్ తోటను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పంట సాగు విధానాలపై రైతుతో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఆపిల్ మొక్కలు నాటాలని ఎవరూ తొందర పడరాదన్నారు. ముందుగా జిల్లాలో ఆపిల్ సాగుపై శాసీ్త్రయంగా ఉద్యానశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా విశ్లేషణ చేసిన తర్వాత ఆశాజనక ఫలితాలు వస్తే పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈరమ్మ, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఉద్యాన అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు.


