పుట్టపర్తి టౌన్: తీవ్ర ఒత్తిళ్ల మధ్య పని చేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాలు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అధికార యంత్రాంగం సంయుక్తంగా పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీ మహల్‌లో అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని గురువారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే పని తీరు కూడా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌ఓ భరత్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం, డీసీహెఎస్ మధుసూదన్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచన


