ప్రాణాలు బలిగొన్న ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

గుంతకల్లు టౌన్‌: ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లులోని శ్రీనివాసనగర్‌కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుదీప్‌ (10) స్థానిక చర్చి స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సమీపంలోనే ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్‌.. నీట మునిగిపోయాడు. బాలుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని నీట మునిగిన సుదీప్‌ను వెలికి తీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement