రోత రాతలపై మహిళాగ్రహం | - | Sakshi
Sakshi News home page

రోత రాతలపై మహిళాగ్రహం

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

సాక్షి, పుట్టపర్తి జర్నలిస్టు ముసుగులో మహిళల గురించి దిగజారుడు రాతలు రాసిన ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. భార్యకు, చెల్లికి తేడా లేకుండా నీచంగా మాట్లాడిన రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా మహిళలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం మహిళలను కించపరిచేలా విధంగా కథనాలు ప్రచురించిన రాధాకృష్ణ... తన దిగజారుడు తనాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని.. కానీ రాధాకృష్ణ పాత్రికేయ వృత్తిని అడ్డు పెట్టుకుని బ్రోకరిజం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్‌’ నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ మహిళలను కించపరిచేలా వార్తలు ప్రచురించారన్నారు.

హిందూపురంలో...

రాధాకృష్ణ దిగజారుడు జర్నలిజాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పుట్టపర్తిలో...

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ పుట్టపర్తి రూరల్‌ సీఐ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు.

మడకశిరలో...

ఏబీఎన్‌ రాధాకృష్ణ మహిళలను కించ పరుస్తూ చేసిన వ్యాఖ్యలపై మడకశిరలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ధర్మవరంలో...

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ మహిళలు మండిపడ్డారు. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు, జయమ్మ, సానె వరలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

మహిళలను కించపరిచిన

రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే

దిగజారుడు రాతలపై

నిరసనలు, ర్యాలీలు

జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు, వైఎస్సార్‌సీపీ నేతలు

రాధాకృష్ణపై కేసు నమోదు చేసి

కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement