తీర్థయాత్రికులకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రికులకు ప్రత్యేక రైళ్లు

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

గుంతకల్లు: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం సమ్మర్‌ స్పెషల్‌ భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్‌ డీసీఎం మనోజ్‌ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 1 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలతో విశాఖ, హైదరాబాద్‌ నుంచి రైళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

● కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం, తంజావురు, అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర (ఎస్‌సీజెడ్‌జీ 60) ఈ నెల 27న ప్రారంభమై మే 4న వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్‌ ధర రూ.14,700 ఉంటుంది. విశాఖపట్నంలో రైలు బయలుదేరి తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంట జంక్షన్‌ల మీదుగా వెళ్తుంది.

● హరిద్వార్‌–మాతా వైష్ణోదేవి–రిషికేష్‌ యాత్ర (ఎస్‌సీజెడ్‌బీ 57) మే 12న ప్రారంభమై మే 21 వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్‌ ధర రూ.16,500, 3 ఏసీ ధర రూ.25,700, 2 ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌, కాగజ్‌నగర్‌, బల్హర్ష, వార్తా నాగ్పూర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

● ఈ రైళ్లలో సౌకర్యాల్లో భాగంగా బస్సు, హోటల్‌తో మూడు పూటలా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు. ప్రమాద బీమా, కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు రైళ్లలో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. టికెట్‌ను విశాఖపట్నం, సికింద్రాబాద్‌ నుంచి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి బుక్‌ చేసుకునే ప్రయాణికులు 9281495847, 9281495848, 9281030748 నంబర్లకు, హైదరాబాద్‌ నుంచి బుక్‌ చేసుకునే వారు 9701360701, 9281030727, 7670900698 నంబర్లకు సంప్రందించాలని అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement