పంటంతా ఎండిపోయింది | - | Sakshi
Sakshi News home page

పంటంతా ఎండిపోయింది

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

కనగానపల్లి మండలం పాతపాళ్యం కొత్తూరుకు చెందిన రైతు వెంకటరామిరెడ్డి రబీ సీజన్‌లో బోరుబావి కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. అప్పుడు వ్యవసాయ బోరుబావిలో నీరు పుష్కలంగా వచ్చేవి. కొద్దిరోజులుగా నీరు తగ్గుముఖం పడుతూ వచ్చింది. సక్రమంగా నీరందకపోవడంతో పంటంతా ఎండిపోతోంది. హంద్రీ–నీవా కాలువకు 150 మీటర్ల దూరంలోనే పొలం ఉన్నా.. కాలువకు కాంక్రీట్‌ లైనింగ్‌ చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. రైతు చేసేది లేక పంటను దున్నేసి పశువులకు మేతగా వాడుకుంటున్నాడు. దాదాపు రూ.3 లక్షల వరకు విలువైన పంట దిగుబడులు కోల్పోవాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement