ఇది వరకు కాలువలో నీరు పారేటప్పుడు సమీపంలోని భూముల్లో నీరు ఇంకేవి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా వచ్చేవి. కానీ హంద్రీ– నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడంతో పరిస్థితి తారుమారైంది. బోరు బావుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. మా గ్రామానికి చెందిన ఒక రైతు కాలువ పక్కనే నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడలేదు. పచ్చగా ఉన్న భూములు కాస్తా ‘కాంక్రీట్ లైనింగ్’ పుణ్యమా అని బీళ్లుగా మారిపోతున్నాయి.
– సుధాకర్‌రెడ్డి, రైతు, వై.కొత్తపల్లి,
ఆత్మకూరు మండలం


