విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన సాగతం | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన సాగతం

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

పుట్టపర్తి టౌన్‌: అనంతపురంలోని జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో సోమవారం పుట్టపర్తిలోని విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు మంత్రులు సవిత, టీజీ భరత్‌, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం గం 10.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌ ప్రత్యేక కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో అనంతపురంలోని జేఎన్‌టీయూకు చేరుకున్నారు. అక్కడ కార్యక్రమం ముగించుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రశాంతి నిలయంలో శ్రీనివాస గెస్ట్‌హౌస్‌ చేరుకున్నారు. 4.45 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

పరిష్కార వేదికకు 49 వినతులు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 49 వినతులు అందాయి. అదనపు ఎస్పీ అంకిత సురానా స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథరెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement