బెంగళూరు వాసి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బెంగళూరు వాసి దుర్మరణం

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

పెనుకొండ: లారీని ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని బెంగళూరు సిటీ బన్నేరుఘట్ట ప్రాంతానికి చెందిన గురురాజ్‌, అరుణ్‌ (26), మంజునాథ్‌, రాకేష్‌, గణేష్‌ సోమవారం వేకువజామున కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. తెల్లవారుజాము 3.30 గంటలకు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంటకరెడ్డిపల్లి సమీపంలో బ్రిడ్జిపైకి చేరుకోగానే మలుపు వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో అరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో నలుగురికి తీవ్ర గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement