పుట్టపర్తి టౌన్: స్థానిక సాయి ఆరామంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. స్థానిక ఓ హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాలకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవిరాఘవులు, యు. వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించని భూములను తిరిగి రైతులకు స్వాధీనం చేయడం, పాత విధానంలోని ఉపాధి పథకం కొనసాగింపు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రాయలసీమకు నీటి కేటాయింపులు పూర్తిగా అమలు చేయాలని, జిల్లాలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, చిత్రావతి నదిలో మురుగు నీరు కలవకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారని తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పెనుకొండ హరి, ఫిరంగి ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ప్రాంతీయ కార్యదర్శి బ్యాళ్ల అంజి, నాయకులు పైపల్లి గంగాధర్, సాంబశివ, వెంకటేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.


