అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

హత్యకు గురైనట్లు అనుమానాలు

లేపాక్షి: మండల పరిధిలోని మానేపల్లి వద్ద యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. హంద్రీనీవా కాలువలో తేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని వద్ద ఉన్న ఐడెంటీ కార్డులను పరిశీలించి బెంగళూరుకు చెందిన వినయ్‌కుమార్‌ (30)గా గుర్తించారు. లేపాక్షి మండలంలోని ఎం.వెంకటాపురం గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో శనివారం రాత్రి బెంగళూరు నుంచి వెంకటాపురంకు బయలుదేరి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతన్ని మారణాయుధాలతో కొట్టి చంపారన్న ఆనవాళ్లను కూడా గుర్తించారు. మార్గమద్యలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడన్నారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. హిందూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు, రూరల్‌ సీఐ జనార్దన్‌, పోలీసు సిబ్బంది డాగ్‌స్క్వాడ్‌తో రక్తపు మరకల వద్ద తనఖీ చేశారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేడు పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పుట్టపర్తి టౌన్‌: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలియజేవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement