● కరువు సీమలో యాపిల్‌ సాగు | - | Sakshi
Sakshi News home page

● కరువు సీమలో యాపిల్‌ సాగు

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

పొలంలో వరుస క్రమంలో నాటిన యాపిల్‌ మొక్కలు

విరగ్గాసిన యాపిల్‌ కాయలు

ఎక్కడో ఎముకలు కొరికే చలిలో.. మంచుకురిసే ప్రాంతాల్లో పండే యాపిల్‌ గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు కేవీ రమణారెడ్డి ఆలోచన ఫలితంగా ప్రస్తుతం నిప్పులు కురిసే అనంత జిల్లాలోనూ విరగ్గాసింది. ఇజ్రాయిల్‌ నుంచి తెప్పించుకున్న కేఎల్‌డీ రకం 1,500 యాపిల్‌ మొక్కలను 2024, అక్టోబర్‌లో నాటాడు. పంట ఏపుగా పెరిగింది. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. స్థానిక మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ టన్ను రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బీ గ్రేడ్‌ రూ. 1లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అడుగుతున్నారు. ఒక్కసారి మొక్క నాటితే 25 ఏళ్ల పాటు దిగుబడి ఇచ్చే యాపిల్‌ సాగుపై ఆసక్తి ఉన్న వారు తనను (93469 25502) సంప్రదిస్తే పూర్తి సహకారం అందిస్తానని రమణారెడ్డి అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం:

Advertisement
 
Advertisement
Advertisement