
●ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి.. పదెకరాల్లో శనగ సాగు
ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన దుబ్బ గోపాల్‌రెడ్డి అనే రైతు చేసిన సాహసం అందరి చేత శభాష్ అనిపించేలా చేసింది. ఆదివారం ఆత్మకూరు సమీపంలోని పొలంలో పాళ్యం వెంకట నారాయణరెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎద్దుతో దుబ్బ గోపాల్‌రెడ్డి వినూత్న ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు కళ్లకు గంతలు కట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు పదెకరాల్లో శనగ విత్తనం సాగు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. చాలా మంది కాడెద్దులతో విత్తన సాగు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలువురు ఎద్దులకు బదులు ట్రాక్టర్లతో విత్తనం వేస్తున్నారు. కానీ దుబ్బ గోపాల్‌రెడ్డి ఒక ఎద్దుతో అది కూడా దాని కళ్లకు గంతలు కట్టి పది ఎకరాల్లో తొమ్మిది గంటలలోపే విత్తన సాగు చేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.