రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Oct 5 2025 12:10 PM | Updated on Oct 5 2025 12:10 PM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. విడపనకల్లు శివారులో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన సుధీర్‌ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీలో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అనంతపురంలో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ అనంతరం కుటుంబంతో కలిసి సరదాగా హంపికి వెళ్లాలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం అనంతపురం నుంచి సుధీర్‌ తన భార్య లావణ్య (34), కుమారుడు ఉదయ్‌తో కలిసి శనివారం హంపికి కారులో బయల్దేరాడు. ఇక గోవా నుంచి సంజీవ్‌రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి అనంతపురానికి కారులో వస్తున్నారు. విడపనకల్లు శివారులోని పెట్రోలు బంకు సమీపంలో రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జవడంతో లోపల ఉన్న వారంతా కాళ్లు, చేతులు విరిగి కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కార్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అతికష్టం మీద బయటకు తీసి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో లావణ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రథమ చికిత్స అనంతరం సంజీవ్‌రెడ్డి, పుల్లయ్య నాయుడు, శ్రీనివాసులు, నాగిరెడ్డిలను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులెక్కడ...?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే కంటి వైద్యులు తప్ప మిగిలిన డాక్టర్లు, సూపరింటెండెంట్‌, సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. పోలీసులు, స్థానికులు, కొంతమంది చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు వైద్యులకు సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలోని 50 పడకల ఆస్పత్రిలోనే వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం దారుణమని స్థానికులు వాపోయారు.

స్పీడ్‌ బ్రేకర్లు వేయండి

విడపనకల్లులో పెట్రోలు బంకు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు కెంగూరి ఎర్రిస్వామి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బోయ వెంకటేశులు తెలిపారు. ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్టు ఉంటున్నారని మండిపడ్డారు. స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

కోమాలోకి వెళ్లిన లావణ్య భర్త సుధీర్‌, కుమారుడు ఉదయ్‌, చికిత్స పొందుతున్న సంజీవ్‌రెడ్డి

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో ఘటన

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం 
1
1/4

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం 
2
2/4

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం 
3
3/4

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం 
4
4/4

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement