
వైభవంగా అగ్నిగుండ మహోత్సవం
అగళి: మధూడి గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి ఆలయంలో శనివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరిగింది. మూల విరాట్‌ను వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు తీర్చుకున్నారు. ధూపం వేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనేది భక్తుల నమ్మకం. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన లింగదబీరప్ప స్వాముల నృత్యంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మరూపానికి అరటి కొమ్మలు అగ్నిగుండం వద్ద నాటి కొమ్మలు నరికి బలిదానం చేశారు. పురోహితులు ఉపవాసంతో అగ్నిగుండంలో ఉన్న నిప్పును తమ జోళిలో వేయించుకుని స్వామి వారి మూలవిరాట్ వద్దకు తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులు అగ్నిగుండంలో నడిచారు. పూరోహితుల ఇంటి నుంచి కలశంతో పాటు లింగదబీరులను ఊరేగింపుగా జంబి వృక్షం వద్దకు తెచ్చి పూజలు చేశారు. అనంతంరం దేవాలయంలో పట్టం కూర్చోబెట్టారు.

వైభవంగా అగ్నిగుండ మహోత్సవం