
పిల్లలకు పాఠాలు చెప్పి పరీక్షలు నిర్వహించే టీచర్లే... ఇ
2,078
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు
8,307
ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సంఖ్య
కదిరి: విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుంచి 10వ తరగతి వరకూ 9 రకాల బడులను తీసుకొచ్చింది. పలు రకాల యాప్‌లతో టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే ఇబ్బందులు పడుతున్న టీచర్లపై ఇప్పుడు ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) బండ పడింది. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు ‘టెట్’ రాసి అర్హత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో ఆందోళన మొదలైంది. అయితే ఏళ్లుగా విద్యార్థులకు బోధిస్తున్న తమకు ఇప్పుడు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు అంటున్నారు.
పదోన్నతులకూ ‘టెట్’తో లింకు
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు ‘టెట్’ రాసి ఉత్తీర్ణులు కావాలి. లేకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిందేనా..? అనే టెన్షన్ టీచర్లను వెంటాడుతోంది. ఇక ‘టెట్’ పాస్ కాని వారికి పదోన్నతులు కూడా ఉండవని సుప్రీం తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ... వారికి పదోన్నతులు రావాలంటే ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్’ అర్హత పరీక్షకు సంబంధించి 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ)కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంది. జీఓ జారీలో ముందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇప్పుడు వారు కూడా (ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వారు) టెట్ రాయాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆందోళన మొదలైంది. 2012 తర్వాత టీచర్ వృత్తిలో చేరిన వారు ఇప్పటికే ‘టెట్’ పాస్ అయిన విషయం తెలిసిందే.
కష్టమైన పరీక్షే
ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు ‘టెట్’ పాస్ కావాలంటే కాస్త కష్టమే.
ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీ కేటగిరీ వారు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారు 40 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవలప్‌మెంట్, తెలుగు, ఆంగ్లం, గణితం, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు ‘టెట్’లో పెట్టి పాస్ కావాల్సిందే..అంటే ఎలా? అని టీచర్లు మండిపడుతున్నారు. అందుకే తమకు ప్రత్యేక ‘టెట్’ నిర్వహించాలని కొందరు, ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్న తమకు ‘టెట్’ అవసరమే లేదని ఇంకొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు.
స్పందించని కూటమి
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,078 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,27,104 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 8,307 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు టెట్‌పై ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం సుమారు 3,500 మంది దాకా ఉపాధ్యాయులు ‘టెట్’ పాస్ కావాల్సిందే. లేని పక్షంలో వారంతా తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం స్పందించి టీచర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువడి నెల దాటినా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు
రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే ఇంటికే
సీనియర్ ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన
తీర్పుపై పునరాలోచించాలని
ఉపాధ్యాయుల విజ్ఞప్తి
సుప్రీం తీర్పుపై నేటికీ స్పందించని కూటమి సర్కార్
3,500 మంది
సుప్రీం తీర్పుతో ‘టెట్’ రాయాల్సిన
టీచర్లు (సుమారు)