
ముగిసిన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం
ప్రశాంతి నిలయం: దసరాను పురస్కరించుకుని విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సన్నిధిలో చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత యజ్ఞ వస్తువులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ర్యాలీగా పూర్ణచంద్ర ఆడిటోరియానికి వెళ్లి అక్కడ పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూర్ణాహుతి ముగిసిన తర్వాత వేదపండితులు యజ్ఞ జలాన్ని భక్తులపై చల్లి ఆశీస్సులు అందజేశారు.
పరవశించిన భక్తజనం
దసరా వేడుకల్లో భాగంగా గురువారం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు స్ఫూర్తి రావు బృందం సభ్యులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ వారు ఆలపించిన గీతాలతో భక్తజనం పరవశించారు. చక్కటి భక్తి గీతాలతో నిర్వహించిన సంగీత కచేరీతో మైమరచిపోయారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ దసరా వేడుకల్లో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలు ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయం నార్త్ బిల్డింగ్స్ వద్ద గల నిత్యాన్నదాన మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు అన్న ప్రసాద వితరణ చేశారు.

ముగిసిన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం

ముగిసిన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం

ముగిసిన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం