
అనుభవమే గొప్ప అర్హత
విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత. సీనియర్ టీచర్ల బోధనా నైపుణ్యాలను ‘టెట్’ పరీక్షతో కొలవలేం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీనిపై పునఃసమీక్షించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలి.
– హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్టీయూ
పునరాలోచన చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఉపాధ్యాయ నియామకాలు జరిగినప్పుడు లేని నిబంధన.. ఇప్పుడు పెట్టడం సరికాదు. కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించాలి.
– కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్
ప్రభుత్వాలు చొరవ చూపాలి
రెండేళ్లలో టీచర్లు ‘టెట్’ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నారు. వయసు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతలు, ఇలాంటి తరుణంలో టెట్‌కు ప్రిపేర్ కావాలంటే కష్టం. దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తగు న్యాయం చేయాలి.
– జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ నేత
సుప్రీం తీర్పు వర్తిస్తుంది
తమిళనాడుకు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు ‘టెట్’పై కీలక తీర్పునిచ్చింది. అది మనకూ వర్తిస్తుంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలన్నా ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరి అని తీర్పులో స్పష్టంగా ఉంది. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపునిచ్చారు.
–కిష్టప్ప, జిల్లా విద్యాశాఖాధికారి

అనుభవమే గొప్ప అర్హత

అనుభవమే గొప్ప అర్హత

అనుభవమే గొప్ప అర్హత