
వైద్యుల వినూత్న నిరసన
పుట్టపర్తి అర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు నాలుగోరోజు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద దీక్షా శిబిరం వద్ద పలువురు వైద్యులు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. గత సెప్టెంబర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్సల్లో పాల్గొన్న వారికి రూ. 5 వేల ప్రోత్సాహకం, పీజీ ఇన్ సర్వీస్ కోటా పునరుద్ధరణ, టైం బౌండ్ ప్రమోషన్లను తక్షణమే పరిష్కరించాలని, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు అలవెన్సులు, 2020లో చేరిన వైద్యులకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దలు ఇప్పటికై నా వారితో చర్చలు జరపాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగో రోజు
మోకాళ్లపై కూర్చుని ఆందోళన