
నేరాల కట్టడికి సమన్వయంతో పనిచేయాలి
హిందూపురం: నేరాల కట్టడికి పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన హిందూపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు రికార్డులు పరిశీలించారు. ఇటీవల కాలంలో నమోదైన కేసులు..దర్యాప్తు గురించి ఆరా తీశారు. నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల గురించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రోజు రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేసి చోరీలు, అక్రమ రవాణా, డ్రంగ్ అండ్ డ్రైవ్‌ను నియంత్రించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారులు, ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డయల్ 112కు వచ్చేకాల్స్‌కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు తగిన సాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన పెంచుతూ చైతన్య పరచాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, కరీం, జనార్దన్, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
హిందూపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ తనిఖీ