
నేడు ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు
ప్రశాంతి నిలయం: దసరా వేడుకలు గురువారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరగనున్నాయి. పండుగ నేపథ్యంలో సాయికుల్వంత్ సభా మందిరాన్ని, సత్యసాయి మహాసమాధిని అలంకరించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురువారం పూర్ణాహుతితో ముగియనుంది. ఆరు రోజులుగా జరుగుతున్న యజ్ఞంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
అలరించిన సాయికథ..
సత్యసాయి జీవిత చరిత్రను గాన రూపంలో వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన ‘మధురం మధురం సాయి కథ’ సంగీత కచేరీ భక్తులను మైమరపింపజేసింది. బుధవారం సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్ ఉపన్యాసకురాలు ప్రొఫెసర్ సుమారావు సత్యసాయి ప్రేమ తత్వాన్ని వివరిస్తూ ప్రసంగించారు. వేయి తల్లుల ప్రేమను ఒక్క సత్యసాయి భక్త కోటికి పంచారని వివరించారు. అనంతరం సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు ‘మధురం మధురం సాయి కథ’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు.

నేడు ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు