
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు అర్హత సాధించింది. అనంతరం ఎమ్మెస్సీ చదివేందుకు జపాన్ లోని మెక్స్ సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి ఆ దేశంలోని హోక్కాయిడో యూనివర్సిటీలో రూ.70 లక్షల ఉపకార వేతనంతో ఉచితంగా సీటు దక్కించుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, వాటి ఫలాలను రైతులకు చేరువ చేస్తానని భానురేఖ సగర్వంగా అంటున్నారు.