
యువకుడి దుర్మరణం
అగళి: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం రంగనపల్లి గ్రామానికి చెందిన మేలగిరియప్ప కుమారుడు రంగనాథ్ (26) మంగళవారం అగళి మండలం హెచ్‌డీ హళ్లి గ్రామంలోని తన అక్క ఇంటికి వచ్చాడు. భోజనం ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. జంగమరపల్లి చెక్‌పోస్ట్ వద్ధకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ఎగిరి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకుని ఒక్కగానొక్క కుమారుడు మృతితో బోరున విలపించారు. ఫిబ్రవరిలో రంగనాథ్‌కుర వివాహం నిశ్చయమైందని, ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందంటూ రోదించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.
బొలెరో ఢీకొని....
తనకల్లు: మండలంలోని చీకటిమానిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లికి చెందిన శ్రీనివాసులు (31) వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై మంగళవారం అన్నమయ్య జిల్లా పాతకోటకు వెళ్లిన శ్రీనివాసులు అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. చీకటిమానిపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శ్రీనివాసులు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయం
ఇంతలో దుర్ఘటన