
యూరియా కోసం ఘెరావ్
పుట్టపర్తి అర్బన్: యూరియా కోసం వ్యవసాయ అధికారులను జగరాజుపల్లి, వెంకటగారిపల్లి రైతులు ఘెరావ్ చేశారు. సోమవారం మండలంలోని జగరాజుపల్లికి ఏఓ శ్రీలక్ష్మి, ఏఈఓ ఆనంద్‌నాయక్ వెళ్లగా.. రైతులు చుట్టుముట్టి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు టోకెన్లు ఇచ్చి మంగళవారం యూరియా అందజేస్తామని చెప్పారు. ఇటీవల రేషనలైజేషన్ పేరుతో వెంకటగారిపల్లిలోని ఆర్‌ఎస్‌కే సిబ్బందిని మరో కేంద్రానికి పంపగా.. ఆ గ్రామంలోని ఆర్‌ఎస్‌కే మూతపడింది. దీంతో తమ గ్రామానికి యూరియా కావాలని వెంకటగారిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం ఒక లోడు యూరియా వస్తుందని అధికారులు సర్దిచెప్పారు.