గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు

Sep 29 2025 10:27 AM | Updated on Sep 29 2025 10:27 AM

గొర్ర

గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు

13 జీవాల మృతి

బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై గంటాపురం క్రాస్‌ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో 13 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్న గంటాపురం గ్రామానికి చెందిన భూమే అప్పస్వామి.. ఆదివారం తన గొర్రెల మందను మేపునకు గ్రామ శివారులోని బీడు పొలానికి తోలుకెళ్లాడు. సాయంత్రం గంటాపురం క్రాస్‌ వద్ద జీవాలను జాతీయ రహదారి దాటిస్తుండగా అనంతపురం నుంచి కదిరి వైపుగా వెళుతున్న కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 12 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ తన కారును ఆపకుండా వేగంగా ముందుకెళ్లిపోయాడు. కారు నెంబర్‌ ఫ్లేట్‌ మాత్రం అక్కడే పడిపోయింది. ఆరు నెలలు క్రితం రూ.4లక్షలు అప్పులు చేసి జీవాలను కొనుగోలు చేసి మేపుతున్నట్లు బాధిత కాపరి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

టీడీపీ నాయకుల అరెస్ట్‌

కొత్తచెరువు: మండలంలోని తలమర్లకు చెందిన టీడీపీ నాయకులను అరెస్టు చేసినట్లు ఆదివారం కొత్తచెరువు సీఐ మారుతీశంకర్‌ తెలిపారు. గ్రామంలోని రంగారెడ్డి గారి బాలకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తన భార్యతో కలసి ఇంట్లో భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మారుతీరెడ్డి, రాకేష్‌, కిషోర్‌ ఇంట్లోకి చొరబడి గొడవ పడ్డారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు అనంతరం ఆదివారం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

అత్తపై దాడి.. కేసు నమోదు

రొద్దం: మండలంంలోని పి.రొప్పాల గ్రామంలో అత్తపై దాడిచేసిన కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేంద్ర ఆదివారం తెలిపారు. అత్తతో రవి, నరసింహమూర్తి, అంజి గొడవ పడి, ఇంటి ఆవరణలో ప్రహరీ ధ్వంసం చేశారు. అనంతరం అత్తపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నేత్రదానం

ధర్మవరం రూరల్‌: స్థానిక యాధవవీధికి చెందిన ఓబులేసు కుమారుడు చిన్నారి సాయి శనివారం రాత్రి స్థానిక కళాజ్వోతి సర్కిల్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రక్త బంధం ట్రస్ట్‌ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి టెక్నీషియన్‌ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి సాయి కంటి కార్నియా సేకరించారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్‌, సెక్రటరీ చిప్పల చంద్రశేఖర్‌, పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు 1
1/1

గొర్రెలపైకి దూసుకెళ్లిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement