సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు

Sep 28 2025 7:11 AM | Updated on Sep 28 2025 7:11 AM

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు

ప్రశాంతి నిలయం: తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్టోబర్‌ ఒకటవ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె తప్పదన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డిని కలిసి ఐక్య కార్యచరణ కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సచివాలయ ఉద్యోగులు మాట్లాడారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందు 8 న్యాయమైన డిమాండ్లను ఉంచామని, వీటికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే తమ పంథా మారబోదన్నారు. కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

స్పష్టం చేసిన సచివాలయాల ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement