
కూలి పనులకు వెళ్తున్నా
నాకు పదవీ విరమణ ప్రయోజనాలు రూ.7 లక్షలు దాకా రావాలి. హయ్యర్ పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇంటి కోసం చేసిన అప్పు కూడా తీర్చలేక పోతున్నా. అందుకే వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే బకాయిలు పేరుకు పోయాయి. అంతకు ముందు ఇలా లేదు. ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. – సుబ్బరాయుడు,
ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్, కదిరి
వంద మందికిపైగా చనిపోయారు
డ్రైవర్, శ్రామిక్, సెక్యూరిటీ తదితర కష్టతరమైన ఉద్యోగాలు ఏళ్లపాటు చేయడంతో ఆరోగ్యాలు దెబ్బతిని చాలా మంది సగటు జీవిత కాలం కంటే ముందే చనిపోతున్నారు. ఏడాది కాలంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 మందికి పైగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు అందకుండానే కన్నుమూశారు. కూటమి ప్రభుత్వం వీరికి సుమారు రూ.100 కోట్లు బకాయి పెట్టింది. ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– ఎం.హరిమోహన్, ప్రధాన సలహాదారుడు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం, కదిరి
బకాయి వాస్తవమే
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల బకాయిలు ఉన్నాయి. వీరి వివరాలన్నీ సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశాం. అన్నీ ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. బకాయిలు త్వరలోనే విడుదలవుతాయి.
–మధుసూదన్, జిల్లా ప్రజా రవాణాధికారి

కూలి పనులకు వెళ్తున్నా

కూలి పనులకు వెళ్తున్నా