
దసరా జాతర
కదిరి అర్బన్: దసరా సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా స్వగ్రామలకు, బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయనమయ్యారు. మరోవైపు పండుగ కోసం ఆడబిడ్డలంతా తమ పుట్టింటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజులుగా ఆర్టీసీ బస్టాండులన్నీ కిటకిటలాడుతున్నాయి. శనివారం అయితే కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో పోటెత్తింది. సర్వీసులు తక్కువగా ఉండటంతో బయటి నుంచి కానీ, డిపోలోంచి కానీ బస్సు అలా వస్తే చాలు... సీటు కోసం జనం పరుగులు తీస్తూ పోటీపడ్డారు. 60 మంది సామర్థ్యం కలిగిన బస్సుకు రెట్టింపు సంఖ్యలో ఎక్కారు. హిందూపురం, అనంతపురం, రాయచోటి, మదనపల్లి రూటు బస్సులకు రద్దీ విపరీతంగా కనిపించింది. బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో నిండి జాతరను తలపించింది.