
యువకుడి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: ఉన్నత చదువులు అభ్యసించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు... ధర్మవరంలోని చంద్రబాబునగర్‌కు చెందిన బాలూ నాయక్, కుళ్లాయమ్మ బాయి దంపతుల కుమార్తె పల్లవి (23) ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టింది. నెలలు గడుస్తున్నా.. ఏ ఒక్క అవకాశమూ రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం అర్ధరాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.
సంపులో పడి చిన్నారి మృతి
పరిగి: ప్రమాదవశాత్తు నీటి సంప్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. పరిగి మండలం ఊటుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈశ్వరప్ప, శిల్ప దంపతుల మూడేళ్ల వయసున్న కుమారుడు మహేంద్రసింగ్ ధోని (ఎంఎస్ ధోని ) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్‌లో పడిపోయాడు. కాసేపటి తర్వాత చిన్నారి కోసం గాలింపు చేపట్టిన తల్లిదండ్రులు.. సంపులో తేలియాడుతున్న చిన్నారిని గుర్తించి వెలికి తీసి, హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

యువకుడి బలవన్మరణం