
ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం
ప్రశాంతి నిలయం: దేవీ శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రశాంతి నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. తొలుత సత్యసాయి మహాసమాధి చెంత వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన యజ్ఞ వేదిక వద్ద కృతువులు పూర్తి యజ్ఞం ప్రారంభించారు. వేలాది భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు. వేదపండితులకు నూతన వస్త్రాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అందజేశారు. సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్‌పెన్యూర్ షిప్ విభాగం డీన్ పల్లవ్ కుమార్ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఙంను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నందగిరి క్యాంపస్ విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.

ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం