
● ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కదిరిలోని చౌల్ట్రీ వీధికి చెందిన డాక్టర్ పి.నరసింహరాజు, పంకజరాణి దంపతులు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏటా దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు రోజూ సాయంత్రం మహిళలతో పాటు పిల్లలను ఆహ్వానించి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు అర్థమయ్యేలా బొమ్మల కొలువు ద్వారా తెలియజేస్తున్నామని వివరించారు.
– కదిరి