
బాలకృష్ణకు పిచ్చి ముదిరింది
చిలమత్తూరు: ‘‘ఎవరైనా సరే తమ నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఈ ప్రాంత సమస్యలను విస్మరించి కేవలం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు’’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు పిచ్చి ముదిరిందన్నారు. అందుకే ఆయన అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్యంగా దూషిస్తూ పిచ్చిచేష్టలు చేశారన్నారు. సైకో అంటూ పదేపదే అంటున్న బాలకృష్ణ సైకో ఇజం గురించి రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారన్నారు. తన ఇంట్లో జరిగిన కాల్పుల కేసు నుంచి బయటపడేందుకు బాలకృష్ణ... తనకు మెంటల్ అందని సర్టిఫికెట్ తెచ్చుకుంది నిజం కాదా... ఆనాడు మీ సైకో ఇజంతోనే కాల్పలు జరిపారా.. అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకై క సీఎం వైఎస్ జగన్ అని, ఆయన మీ పిచ్చి చేష్టలకు చిరునవ్వుతో సమాధానం చెప్పారన్నారు. రాష్ట్రమంతా గుండెల్లో పెట్టి చూసుకుంటున్న వ్యక్తిని చులకనగా మాట్లాడిన బాలకృష్ణకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. హిందూపురంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని, సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని... అసెంబ్లీలో వాటి గురించి మాట్లాడని బాలకృష్ణ...మైకు దొరగ్గానే మాజీ సీఎం జగన్‌ను దూషించడానికే సమయమంతా వెచ్చించారన్నారు. బాలకృష్ణ పిచ్చివాగుడు చూసి జనమే ఛీదరించుకుంటున్నారన్నారు. మరోసారి ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌ను తూలనాడితే ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు.